మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 మార్చి 2023 (08:36 IST)

ఫామ్‌లో లేడని జట్టు నుంచి తొలగించమన్నారు.. చివరకు అతనే ఆపద్భాంధవుడు...

klrahul
కేఎల్ రాహుల్. భారత క్రికెటర్. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతన్ని జట్టు నుంచి తప్పించాలంటూ ప్రచారం జరిగింది. కానీ, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం అతనిపై నమ్మకం పెట్టుకుంది. ఫలితంగా శుక్రవారం ముంబై వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను కేఎల్ రాహుల్ ఒంటి చేత్తో గెలిపించి జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలించాడు. ఈ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఐదు వికెట్లు తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో కేఎల్ రాహుల్ అజేయంగా నిలిచారు.  
 
శుక్రవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 189 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్ 39.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో గత కొన్నాళ్లుగా ఫామ్‌లో లేడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ ఇవాళ ఎంతో సమయస్ఫూర్తిగా ఆడి జట్టును గెలిపించాడు. మిడిల్ ఆర్డర్‌లో బరిలోకి దిగిన రాహుల్.. 91 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. రాహుల్ స్కోరులో 7 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. 
 
రాహుల్‌కు రవీంద్ర జేడేజా నుంచి మెరుగైన సహకారం లభించింది. జడేజా కూడా 69 బంతుల్లో ఐదు ఫోర్లతో సాయంతో 45 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లు గిల్ 20, కిషాన్ 3, కోహ్లీ 4 చొప్పున పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 25 పరుగులు, సూర్యకుమార్ పరుగులేమీ చేయకుండా వెనుకిదిరిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, స్టాయినిస్ 2 చొప్పున వికెట్లు తీశారు.