గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (19:12 IST)

ముంబై స్టేడియంలో సందడి చేసిన రజనీ దంపతులు

rajinikanth
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ముంబైలోని వాంఖెడే మైదానంలో తొలి వన్డే మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టేడియంకు వచ్చారు. తన భార్య లతా రజనీకాంత్‌తో కలిసి స్టేడియంకు వచ్చిన ఆయనకు ముంబై క్రికెట్ అసోసియేషన్ పెద్దలు ఘన స్వాగతం పలికారు. 
 
రజనీ దంపతులకు వారు పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ పెద్దలతో కలిసి రజనీ దంపతులు క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తుండగా కెమెరా కంటికి కనిపించారు. వీఐపీ గ్యాలరీలో కూర్చూని వీరు మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.