శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 15 మే 2016 (12:06 IST)

భారత మహిళలు డేటింగ్‌కు అస్సలు ఒప్పుకోరు : స్కాలర్స్ మాన్యువల్

భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి "ట్రావెలర్స్ గైడ్ అండ్ ది స్కాలర్స్ మాన్యువల్" పేరుతో ఓ పుస్తకాన్ని రూపొందించి.. దాన్ని తొలి ముద్రణను 1999లో విడుదల చేసింది. దీన్ని మరింతగా సంస్కరించి తాజాగా విడుదల చేసింది. ఇందులో భారతీయులు, వారు పాటించే ఆచార వ్యవహారాలను ఈ పుస్తకంలో వివరించారు.
 
ముఖ్యంగా.. భారతీయ మహిళలు సంప్రదాయానికి పెద్దపీట వేస్తారనీ, పరిచయం లేనివారికి షేక్‌హ్యాండ్ కూడా ఇవ్వరని ఉంది. డేటింగ్‌కు అస్సలు ఒప్పుకోరని తెలిపింది. సినిమాకి రమ్మంటే మర్యాదగా తిరస్కరిస్తారనీ, ఇలా అనేక విషయాలను ఆ పుస్తకంలో రాశారు. 
 
గత కొన్ని దశాబ్దాల్లో విద్యావంతులైన మహిళలు అనేక సంప్రదాయ అడ్డంకులను అధిగమించారు. ఆధునికత సంతరించుకున్నారు. పురుష విద్యార్థిని పరిచయం చేస్తే అమ్మాయిలు మాట్లాడతారు. ఆధునిక భారతీయ మహిళలు కొన్ని విధాలుగా సంప్రదాయాన్ని పాటించే వ్యక్తులు. సినిమాకి గానీ, ఔటింగ్‌కు కానీ రమ్మని ఏ మగాడైనా అడిగాడంటే సున్నితంగా తిరస్కరిస్తారని ఈ పుస్తకంలో ఉంది.