గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (18:57 IST)

ముక్కులో చుక్కల రూపంలో కరోనా బూస్టర్ డోస్ : డీసీజీఐ అనుమతి

భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో భారత్ బయోటెక్ తయారు చేసిన ఇంట్రా నాసల్ కోవిడ్ బూస్టర్ డోసేజ్ అధ్యయనాలకు పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా తొమ్మిది వేర్వేరు ప్రదేశాల్లో చుక్కల రూపంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ పరీక్షలు చేపట్టనున్నారు. 
 
భారత్ బయోటెక్ ఇటీవల ఓమిక్రాన్ డిఫ్యూజన్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా అందించడానికి, క్లినికల్ అధ్యయనాలు చేయడానికి డీసీజీఐ నుంచి అనుమతిని అభ్యర్థించింది. 
 
భారత్ బయోటెక్ పొందిన సమాచారం ప్రకారం, సుమారు 5,000 మంది వాలంటీర్లపై ఈ క్లినికల్ అధ్యయనాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 
వారిలో సగం మంది కోవాక్సిన్ తీసుకునివున్నారు. మిగిలిన సగం మంది కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నవారు ఉన్నారు. రెండో మోతాదు తీసుకుని 6 నుండి 9 నెలల సమయం పూర్తయిన వారిపై ఈ చుక్కల మందు బూస్టర్ డోస్ ప్రయోగాలను నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాల తర్వాత ఫలితాలను మళ్లీ డీసీజీఐ ముందు ఉంచుతారు.  ఆతర్వాత ఈ చుక్కల మందుకు అత్యవసర అనుమతి లభించే అవకాశం ఉంది.