ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (12:11 IST)

బెంగళూరులో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

బెంగళూరు నగరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గు ముఖం పడుతోంది. రాష్ట్రంలో మూడు వారాలక్రితం 6 లక్షలు దాటిన యాక్టివ్‌ కేసులు కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలతో 3 లక్షలకు చేరుకున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులతో కలిపి 2,93,024 యాక్టివ్‌ కేసులు ఉండగా మృతుల సంఖ్య 30,017కు చేరుకుంది.

తాజాగా 16,387 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 4095, మైసూరు 1687, బెళగావి 1006 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో వందల్లో కేసులు నమోదు కాగా అత్యల్పంగా బీదర్‌లో 23 మందికి పాజిటివ్‌ సోకింది.

రాష్ట్ర వ్యాప్తంగా 21,199 మంది కోలుకోగా బెంగళూరులో 8,620 మంది, తుమకూరులో 1036, మైసూరులో 1034, బెళగావిలో 990, హాసన్‌లో 979 మంది కోలుకున్నారు. ఇతర జిల్లాల్లోనూ డిశ్చార్జ్‌ల సంఖ్య ఆశాజనకంగా ఉంది.

తాజాగా 463 మంది మృతి చెందగా అత్యధికంగా బెంగళూరులో 307 మంది, బెళగావిలో 17 మంది, బెంగళూరు రూరల్‌, హాసన్‌లో 12 మంది మృతి చెందగా ఇతర జిల్లాల్లో అంతకులోపు నమోదు కాగా యాదగిరి, బీదర్‌లలో ఒకరు కూడా మృతి చెందలేదు.