భర్తలేడు.. వేరొక వ్యక్తి ఇష్టమన్నాడు.. నో చెప్పడంతో సామూహిక అత్యాచారం..
భర్త చనిపోవడంతో ఆమె తన కూతురితో ఒంటరి జీవనం గడుపుతోంది. అయితే ఆమె ఇంటి పక్కనే వున్న వ్యక్తి ఆమెను ఇష్టపడ్డాడు. కానీ అందుకు ఒప్పుకోలేదు. ఆ యువకుడు గత ఏడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
దీనిపై ఆగ్రహం చెందిన ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ మహిళను ఇంట్లో నుంచి బయటకు లాగారు. ముగ్గురు బహిరంగంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ దుర్ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటుచేసుకుంది. విహార్ కస్తూర్బా నగర్‌లో గణతంత్ర దినోత్సవం రోజునే ఈ దారుణం జరిగింది.
బాధితురాలి చెల్లెలి ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది.
ఈ వీడియోలో సామూహిక అత్యాచారం తర్వాత బాధితురాలికి నిందితులు శిరోముండనం చేశారు.. చితకబాదారు.. మొహానికి నల్ల రంగు పూసి.. మెడలో చెప్పులదండ వేసి వీధులన్నీ తిప్పారు.