1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (14:48 IST)

జాబ్ చేస్తే ఇంటి పరువు పోతుందట.. కోడలిపై ఇటుక రాతితో దాడి..

Crime
Crime
మహిళలు రాకెట్లలో అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నా.. అకృత్యాలు, వివక్ష ఏమాత్రం తగ్గడం లేదు. తను కూడా ఏదో ఒక పనిచేస్తానని ఇంటర్వ్యూకు వెళ్లడానికి సిద్ధమైన మహిళపై ఆమె సొంత మామ దారుణంగా దాడి చేశాడు. ఢిల్లీలోని ప్రేమ్ నగర్‌లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. 
 
కాజల్, ప్రవీణ్ కుమార్ దంపతులు. ప్రవీణ్ చిరుద్యోగి. తను కూడా ఏదో ఒక జాబ్ చేస్తానని కాజల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటోంది. భర్త సరేనన్నా మామకు గుర్రుగా ఉంటున్నాడు. 
 
జాబ్ చేస్తే ఇంటి పరువు పోతుందన్నాడు. ఆమె పట్టించుకోకపోవడంతో ఇటుకపెళ్లతో దాడి చేశాడు. ఆమె నడినెత్తిపై బాదాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. స్థానికులు ఆమెను సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలకు 17 కుట్లుపడ్డాయి. పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు.