శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (09:49 IST)

రాజస్థాన్‌ వధువుకు మేనమామల కానుకలు.. రూ.3కోట్లు ఇచ్చారు..

Money
Money
రాజస్థాన్‌కు చెందిన ఓ వధువు భారీగా పెళ్లి కానుకలు అందుకుంది. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ముగ్గురు మేనమామలు తమ మేనకోడళ్ల వివాహానికి కానుకగా మూడు కోట్ల రూపాయలకు పైగా ఇచ్చిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో వధువు తాత, మేనమామలు రూ. 80 లక్షల నగదు, నగలు, ప్లాట్ పేపర్లు తీసుకుని వేదిక వద్దకు చేరుకున్నారు. వధువు లేదా వరుడి మేనమామ తన మేనకోడలు లేదా కానుకలను తీసుకువెళ్లే సంప్రదాయ ఆచారం రాజస్థాన్‌లో వుంది. 
 
ఈ ఆచారం ప్రకారం వధువుకు వారి మేనమామలు భారీగా కానుకలు ఇచ్చుకున్నారు. దీన్ని చూసి వధువు కుటుంబీకులు షాక్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రిపోర్టర్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశాడు. వైరల్ అయిన ఈ వీడియోకు లైకులు వెల్లువల్లా వస్తున్నాయి.