శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

పురుడు పోశారు... కడుపులో కాటన్ వదిలేశారు.. ఎక్కడ?

operation
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళకు పురుడు పోసిన వైద్యులు.. కాటన్‌ను ఆమె కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని అమ్రెహా ప్రాంతానికి చెందిన నజ్రానా అనే మహిళ కొద్ది రోజుల క్రితం ప్రసవ వేదనతో స్థానికసైఫీ నర్సింగ్ హోంలో చేరింది. అక్కడ వైద్యుజు మత్లూబ్, ఆయన సిబ్బంది ఆమెకు ఆపరేషన్ చేసిన డెలివరీ చేశారు. అయితే, వైద్యుడితో పాటు అతని సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి కాటన్‌ను ఆమె పొట్టలో ఉంచి కుట్లు వేసినట్టు తెలిపారు. 
 
ఆపరేషన్ తర్వాత నజ్రాన్ కడుపునొప్పి ఎక్కువగా ఉందని చెప్పంది. కానీ, వైద్యుడు మాత్రం చేసిన తప్పును తెలుసుకోకుండా బయట చలి ఎక్కువగా ఉందని, అందువల్లే అలా ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆమె భర్త మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత వైద్యులు మరో ఆపరేషన్ చేసి టవల్‌ను బయటకు తీశారు.