సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 20 జనవరి 2020 (05:20 IST)

మీ క్రెడిట్ స్కోర్ తగ్గిందా?

బ్యాంకుల నుంచి రుణాలు పొందాలంటే ఇప్పుడు క్రెడిట్ స్కోరు అనేది చాలా అవసరం. అయితే కొన్ని సార్లు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల స్కోరు తగ్గిపోతుంది. అయితే క్రెడిట్ స్కోరుపై తిరిగి పునరుద్ధరించుకోవచ్చా అని చాలా మందికి సందేహాలు ఉంటాయి.

స్కోరు పునరుద్ధరణకు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకోండి ఇప్పుడే. తాజాగా మీ క్రెడిట్ రిపోర్టును త‌నిఖీ చేస్తున్న‌ప్పుడు క్రెడిట్ స్కోరు త‌గ్గిన‌ట్ల‌నిపించిందా? తీసుకున్న రుణాల‌ను స‌మ‌యానికి తీర్చ‌క‌పోవ‌డం లేదా అప్పుల‌ను ఎగ్గొట్ట‌డం దీనికి కార‌ణం కావ‌చ్చు.

ఇవి కాకుండా ఏవైనా త‌ప్పులు లేదా ఎప్పుడో తీసుకున్న రుణానికి సంబంధించిన బ‌కాయిల విష‌యం మీకు జ్ఞ‌ప్తికి రాక‌పోవ‌డం వ‌లన ఏమైనా స్కోరు త‌గ్గితే ప‌రిస్థితేంటి? దానిని ఎలా స‌రిదిద్దుకోవాలో కింద తెలుసుకుందాం. అస‌లు క్రెడిట్ స్కోరు అంటే ఏంటి?

తీసుకున్న రుణాన్ని మీరు ఎప్పటిలోగా చెల్లిస్తార‌నే సామ‌ర్థ్యాన్ని ప‌రిగ‌ణ‌నలోనికి తీసుకుని క్రెడిట్ స్కోరును ఇస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు మీకు కార్‌, వ్య‌క్తిగ‌త రుణం లేదా క్రెడిట్ కార్డుపై రుణం తీసుకుని స‌మ‌యానికి చెల్లింపులు జ‌రిపితే మీ క్రెడిట్ స్కోరు బాగుంటుంది. ఒక‌వేళ మీరు స‌మ‌యానికి డ‌బ్బులు క‌ట్ట‌క‌పోయినా లేదా ఎగ్గొట్టినా మీ స్కోరు త‌గ్గిపోయే అవకాశం ఉంది.

ప్ర‌స్తుతం దేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు, ఈ క్రెడిట్ రిపోర్టులు, స్కోరుల‌ను అందిస్తున్నాయి. ఇదొక మూడంకెల సంఖ్య‌, స్కోరు 750 పైన ఉంటే, మంచిది. అంత‌కంటే త‌క్కువ ఉంటే క‌ష్ట‌మే. క్రెడిట్ స్కోరు బాగుంటే మీరు సుల‌భంగా రుణాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే త‌క్కువ వ‌డ్డీకే రుణాల‌ను పొందే వీలు కూడా ఉంది.