గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (15:58 IST)

బంగాళాఖాతంలో భూకంపం.. చెన్నైలో ప్రకంపనలు... సునామీ భయం

బంగాళాఖాతంలో మంగళవారం (ఆగస్టు 24, 2021) భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.1గా నమోదు అయింది. చెన్నైలోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 12.23 గంటలకు భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. ఏపీలోని కాకినాడ సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు పేర్కొంది.
 
భూకంపం ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. తిరువన్మియూర్, ఆళ్వార్‌పేట్, చెన్నైలోని సుముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ప్రకంపనలు సంభవించినట్లు వచ్చినట్లు ట్వీట్లలో పేర్కొన్నారు. భూకంపంతోనే ప్రకంపనలు వచ్చినట్లు ఐఎండీ చెన్నై శాఖ ధ్రువీకరించింది. ప్రకంపనలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపింది.
 
భూకంపం కాకినాడకు ఆగ్నేయంగా 296 కిలోమీటర్లు, చెన్నైకి ఈశాన్యంగా 320 కిలోమీటర్ల భూకంప కేంద్రీకృతమైనట్లు గుర్తించారు. అయితే సముద్ర అలలను పరిశీలిస్తున్నామని ఐఎండీ అధికారి తెలిపారు. ముందస్తుగా సునామీపై ఎలాంటి అంచనా వేయలేమని, హెచ్చరికలు జారీ చేయలేమని చెప్పారు.