మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2023 (08:38 IST)

భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు

Oils
దేశంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. ఈ పెరిగిన ధరలను చూసి సామాన్య ప్రజానీకం గగ్గోలుపెడుతున్నారు. దీంతో ధరల తగ్గుదలకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, రిఫైన్డ్ నూనెల దిగుమతి సుంకం 17.5 నుంచి 12.5 శాతానికి కేంద్రం తగ్గించింది. ఈ తగ్గింపు గురువారం నుంచే అమల్లోకి వచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా దీర్ఘకాలంలో దిగుమతులపై ప్రభావం చూపుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
శుద్ధి చేసిన వంట నూనెలైన సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. గతంలో 17.5 శాతంగా ఉన్న సుంకం ప్రస్తుతం 12.5 శాతానికి చేరుకుంది. గురువారం నుంచే ఈ తగ్గింపు అమల్లోకి రావడంతో దేశ వ్యాప్తంగా కూడా త్వరలోనే వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 
 
సాధారణంగా ముడి సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలను మన దేశం భారీగా దిగుమతి చేసుకుంటుంది. ఇపుడు ప్రభుత్వం రిఫైన్డ్ ఆయిల్స్‌పైనా సుంకాన్ని తగ్గించింది. అయితే, ప్రభుత్వ నిర్ణయంతో దిగుమతులపై దీర్ఘకాలిక ప్రభావం ఏమీ ఉండదని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా వెల్లడించారు.