సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (13:43 IST)

టీడీపీలో చేరబోతున్నాను.. కమెడియన్ సప్తగిరి ప్రకటన

Saptagiri
సినీ నటుడు, స్టార్ కమెడియన్ సప్తగిరి రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు సప్తగిరి ప్రకటించారు. టీడీపీ నుంచి ఆఫర్ ఉన్నమాట వాస్తవమేనని, కాకపోతే ముందే చెప్పడం సరికాదని అన్నారు. 
 
మరో పది, 15 రోజుల్లో శుభవార్త చెబుతానని వెల్లడించారు. పేదలకు సేవ చేసేందుకు ఏ అవకాశం వచ్చినా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏమి ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. టీడీపీ అధికారంలో రావడానికి తన సేవలు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానని వెల్లడించారు. 
 
నిజాయతీతో సినిమా రంగంలో అవకాశాలను దక్కించుకోగలిగాను. అలాగే రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటా. సినిమా వల్లే రాజకీయంగా అవకాశాలు వచ్చాయని సప్తగిరి తెలిపారు.