శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (17:06 IST)

ఫిబ్రవరి 8న ఢిల్లి శాసనసభకు ఎన్నికలు

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఢిల్లి శాసనసభకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) సునీల్‌ అరోరా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. నేటినుంచి కోడ్‌ అమల్లోకి వచ్చిందని ఆయన చెప్పారు.

శాసనసభలోని మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 14 వ తేదీన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఆ రోజునుంచే నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన్ల దాఖలకు ఈ నెల 21వ తేదీ ఆఖరు రోజు అని ఆయన చెప్పారు.

24వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు రోజని ఆయన అన్నఆరు. ఫిబ్రవరి 8వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడవుతాయని ఆయన అన్నారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి 90 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పోలింగగ్‌ కోసం మొత్తం 13767 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.