గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 నవంబరు 2016 (09:21 IST)

అమ్మా... తప్పు చేశా.. పెద్ద మనసుతో క్షమించు.. కష్టాలు పడలేను : ఎడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ

అన్నాడీఎంకే బహిష్కతృ రాజ్యసభ సభ్యురాలు ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు రాయబారం పంపారు. తాను తప్పు చేశానని, తనను పెద్ద మనసుతో క్షమించాలని ప్రాధేయపడ్డారు. పైగా, తనపై మోపిన కేసుల కష్టాల

అన్నాడీఎంకే బహిష్కతృ రాజ్యసభ సభ్యురాలు ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు రాయబారం పంపారు. తాను తప్పు చేశానని, తనను పెద్ద మనసుతో క్షమించాలని ప్రాధేయపడ్డారు. పైగా, తనపై మోపిన కేసుల కష్టాలు భరించలేనని అందువల్ల తనను క్షమించాలని కోరారు. అన్నాడీఎంకే అధిష్టానానికి వ్యతిరేకంగా రాజ్యసభలో బహిరంగ ఆరోపణలు చేసి శశికళ పుష్ప కలకలం రేపిన విషయం తెలిసిందే. అందువల్ల ఆమెపై క్రమశిక్షణ చర్యలు చేపట్టి పార్టీ సభ్యత్వం నుంచి తొలగించారు. అనంతరం అన్నాడీఎంకే, ముఖ్యమంత్రి జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళ కుటుంబసభ్యుల గురించి ప్రసార మాధ్యమానికి తప్పుడు సమాచారం తెలియజేసి ఆగ్రహం వెళ్లగక్కారు.
 
ఈ నేపథ్యంలో తంజావూరు, తిరుప్పరకుండ్రం, అరవకురిచ్చి, పుదుచ్చేరి నెల్లితోపు నియోజకవర్గాల్లో పోటీచేసిన అన్నాడీఎంకే అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని వాట్సాప్‌ ద్వారా శశిశక పుష్ప ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జయలలిత పదవికి కళంకం, ముప్పు వాటిల్లజేసేందుకు ఓ ముఠా కుట్రపన్నిందని, అన్నాడీఎంకే ఎంపీ హోదాలో తాను దాన్ని అడ్డుకోగలిగానని అందులో పేర్కొన్నారు. రాజ్యాంగ శాసనం ప్రకారం ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడి, ప్రజల మనోభావాలను గౌరవించి స్నేహానికి గౌరవం చేకూర్చిన నరేంద్ర మోడీకి సర్వదా రుణపడి ఉంటానని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు. ఇదిలావుండగా, రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామమోహనరావు, సీఎం సలహాదారు షీలా బాలకృష్ణన, కార్యదర్శి కేఎల్‌ వెంకట్రామనలకు రాసిన లేఖ సారాంశాన్ని ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి తీసుకెళ్లాలని శశికళ పుష్ప విజ్ఞప్తి చేశారు.
 
అయితే, శశికళ పుష్పలో ఆకస్మికంగా కలిగిన మార్పు గురించి పలువురు అన్నాడీఎంకే సీనియర్లు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా శశికళ పుష్పను రెచ్చగొట్టి డీఎంకే సభ్యురాలు కనిమొళి ద్వారా డీఎంకే తీర్థం పుచ్చుకొనేందుకు ప్రయత్నాలకు ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్ అడ్డుకట్ట వేశారని తెలిపారు. దీంతో ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్‌, బీజేపీలో చేరేందుకు ఆ పార్టీలకు చెందిన నేతలతో ఆమె జరిపిన మంతనాలు ఫలించకపోవడంతో మళ్లీ అమ్మ పార్టీలో చేరే ప్రయత్నాల్లో దిగారని, అయితే తమ పార్టీ సుప్రీం శశికళ పుష్పను క్షమించబోరని వారు పేర్కొన్నారు.