సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (09:55 IST)

ప్రత్యేక దేశంగా కాశ్మీర్!!

జమ్మూతోపాటు కాశ్మీర్ కూడా భారత్‌లో అంతర్భాగం. భూతల స్వర్గంగా పేరుగాంచిన కాశ్మీర్‌ను కైవసం చేసుకునేందుకు పాకిస్థాన్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అనేక విధాలుగా రెచ్చగొడుతోంది. పాక్ దుశ్చర్యలను కేంద్రం తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాశ్మీర్‌లోని పుల్వామాలో భారత సైన్యంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 47 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ సమాజం జోక్యంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గాయి. 
 
ఈ నేపథ్యంలో కాశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ఫేస్‌బుక్ పేర్కొంది. దీన్ని నెటిజన్లు ఏకిపారేశారు. ఇరాన్‌ నెట్‌వర్క్‌లకు లక్ష్యంగా మారిన దేశాలను ప్రస్తావిస్తూ ఓ బ్లాగ్‌ పోస్టులో పెట్టిన జాబితాలో ఈ పొరపాటు చోటుచేసుకుంది. ఇవాళ ఇరాన్ నెట్‌వర్క్‌లకు లక్ష్యంగా మారిన 513 పేజ్‌లను, గ్రూపులను ఫేస్‌బుక్ పాలసీలకు అనుగుణంగా తీసేశామంటూ ఫస్‌బుక్ బ్లాగ్‌లో వెల్లడించింది. 
 
ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియాలతోపాటు కశ్మీర్‌ను సదరు దేశాల జాబితాలో చేర్చిన ఫేస్‌బుక్.. నెటిజన్‌లు అలర్ట్ చేయడంతో తప్పును గుర్తించి క్షమించండి పొరపాటు జరిగింది అంటూ క్షమాపణలు చెప్పింది. అలాగే ఇరాన్, రష్యా, మకెడోనియాలలో  2,632 పేజ్‌లను, గ్రూపులను ఫేస్‌బుక్ రిమూవ్ చేసినట్లు ప్రకటించింది.