శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2019 (16:34 IST)

బిర్యానీని ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసుకుని తింటున్నారా..? ఐదేళ్ల చిన్నారి మృతి..

హోటల్స్‌లో తీసుకొచ్చిన బిర్యానీని పారేయలేక ఫ్రిజ్‌లో వుంచి మరుసటి రోజు వేడి చేసుకుని ఆరగించే అలవాటున్నవారు మీరైతే.. ఇకపై అలా చేయకండి. అలా చేశారో ప్రాణాలకే ప్రమాదమని చెప్పే ఓ ఘటన తమిళనాడులోని.. వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. బిర్యానీని మళ్లీ వేడి చేసుకుని తీసుకున్న కారణంగా ఐదేళ్ల చిన్నారి అస్వస్థతకు గురై.. ప్రాణాలు కోల్పోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. వేలూరు జిల్లా అరక్కోణం, తండలం, న్యూ కాలనీకి చెందిన శ్రీనివాసన్-కనక దంపతులు బంధువుల ఇంటి శుభకార్యానికి వెళ్లారు. అక్కడ బిర్యానీ విందు ఏర్పాటు చేశారు. కానీ బిర్యానీ మిగిలిపోవడంతో.. ఈ దంపతులు ఇంటికి తెచ్చుకున్నారు. ఈ బిర్యానీని ఫ్రిజ్‌లో వుంచి.. మరుసటి రోజు మళ్లీ వేడి చేసుకుని.. ఆరగించారు. 
 
శ్రీనివాసన్ కుమార్తె గోపిక అనే ఐదేళ్ల చిన్నారి కూడా ఈ బిర్యానీని తీసుకుంది. మరో నలుగురు చిన్నారులు కూడా బిర్యానీని తీసుకుని అస్వస్థతకు గురైనారు. దీంతో అరక్కోణం ఆస్పత్రిలో గోపికతో పాటు నలుగురు చిన్నారులను చికిత్స నిమిత్తం తరలించారు. 
 
అక్కడ చికిత్స పొందుతూ.. గోపిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిర్యానిని వేడి చేసి తినడం ద్వారా చిన్నా రి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.