శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (09:45 IST)

ల్యాప్‌టాప్‌ బుక్‌చేసుకుంటే.. రాయి.. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు..

Laptop
Laptop
ఈ-కామర్స్ సైట్లు అప్పుడప్పుడు పార్సిల్స్ మార్చేయడం చూసివుంటాం. తాజాగా ల్యాప్‌టాప్‌ బుక్‌చేసుకున్న వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ల్యాప్‌టాప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వ్యక్తికి రాయితో పాటు కొంత ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ప్యాంకింగ్ చూసి ఖంగుతిన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. దీపావళి ఆఫర్లు ఉన్నాయన్న ఉద్దేశంతో కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి కోసం అక్టోబరు 15న ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లో ల్యాప్‌టాప్‌ ఆర్డర్‌ చేశాడు. తీరా పార్సిల్‌ వచ్చాక తెరచి చూస్తే.. అందులో రాయి, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు ఉన్నాయి. 
 
వెంటనే కస్టమర్‌కేర్‌కి ఫోన్‌ చేసి సమస్యను చెప్పినా తొలుత ఉపయోగం లేకపోయింది. ఎట్టకేలకు అతికష్టం మీద డబ్బును తిరిగి పొందాడు. ఈ ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.