శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (16:25 IST)

ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్లు: నిర్మలా సీతారామన్

ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్లు, ఇతర రంగాలకు రూ.60వేల కోట్ల ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈసీఎల్‌జీఎస్ పథకం లిమిట్‌ను రూ.3లక్షల కోట్ల నుంచి రూ. 4.5 లక్షల కోట్లకు పెంచుతున్నట్టు సీతారామన్ వెల్లడించారు. చిన్న ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు ఇచ్చే అంశాన్ని ఈ సందర్భంగా సీతారామన్ పేర్కొన్నారు. 
 
ఒక్క వ్యక్తికి గరిష్టంగా రూ. 1.25 లక్షల రుణాన్ని ఇవ్వనున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. కొత్తవారికి ఎక్కువగా రుణాలు ఇవ్వాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రుణ హామీ పథకం ద్వారా చిన్న పట్టణాల్లోని వారికి కూడా లబ్ది చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
 
ఇకపోతే.. కరోనా కారణంగా ఎక్కువగా నష్టపోయిన టూరిజం రంగానికి కూడా కేంద్రం చేయూత అందించింది. ఈ రంగంలో భాగస్వాములైన వారికి లోన్ గ్యారంటీ ఇవ్వనుంది. టూరిజం ఏజెన్సీలకు రూ. లక్షల వరకు తీసుకునే లోన్‌కు వంద శాతం గ్యారంటీ ఇవ్వనున్నట్టు తెలిపింది. టూరిస్ట్ గైడ్‌లకు రూ. లక్ష వరకు తీసుకునే లోన్‌కు గ్యారంటీ ఇస్తామని పేర్కొంది.