సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (14:01 IST)

భారత్‌లో అడుగుపెట్టాలనుకుంటే దావూద్ శవమైపోతాడు: ఎమ్ఎన్ సింగ్

ముంబై పేలుళ్ల సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ముంబై మాజీ పోలీస్ బాస్ ఎంఎన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దావూద్ ఇబ్రహీం ఇక తన జీవితంలో భారత్‌కు తిరిగి వచ్చే అవకాశాలు లేవని ఎంఎన్ సింగ్ అన్

ముంబై పేలుళ్ల సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ముంబై మాజీ పోలీస్ బాస్ ఎంఎన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దావూద్ ఇబ్రహీం ఇక తన జీవితంలో భారత్‌కు తిరిగి వచ్చే అవకాశాలు లేవని ఎంఎన్ సింగ్ అన్నారు. దావూద్ ఇబ్రహీం పేరు చెప్తే ముంబై ప్రజలు భయపడే రోజులు పోయాయని, దావూద్ భారత్‌ వస్తాడనే ఆలోచన కూడా అక్కర్లేదని చెప్పుకొచ్చారు. 
 
ప్రస్తుతానికి దావూద్ పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ ఆధీనంలో వున్నాడని ఎంఎన్ సింగ్ చెప్పుకొచ్చారు. దావూద్ భారత్‌కు తిరిగి వచ్చే ఆలోచన చేస్తే.. ఐఎస్ఐ అతడిని హతమార్చడం ఖాయమన్నారు. అందుచేత ఇకపై దావూద్‌ను మర్చిపోండని ఎంఎన్ సింగ్ తెలిపారు. కాగా.. 1993 నాటి పేలుళ్ల ఘటన తర్వాత ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్‌గా, నగర పోలీస్ కమిషనర్‌గా, ముంబై క్రైమ్ బ్రాంచ్ సంయుక్త కమిషనర్‌గా ఎమ్ఎన్ సింగ్ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.