పక్షి వల్ల ఇలా జరిగింది.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో..?
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ఎమెర్జెన్సీ విధించారు. ఏప్రిల్ 1న దుబాయ్‌కి వెళ్లే ఫెడెక్స్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఓ పక్షి ఢీకొట్టింది.
దీంతో అధికారులు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వెయ్యి అడుగుల ఎత్తులో పక్షి దాడి జరిగిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు.
ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఎయిర్‌పోర్ట్ అధికారులు ఎమర్జెన్సీని విధించినట్లు అధికారులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం విమానం దుబాయ్‌కి మధ్యాహ్నం 3.29 గంటలకు చేరుకోవాలి.