సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మార్చి 2023 (10:44 IST)

ఎస్ఎస్సీ సీహెచ్‌ఎస్ఎల్ ఫలితాలు విడుదల - స్కిల్ టెస్ట్ రిజల్ట్స్ కూడా..

staff selection commission
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2021 స్కిల్ టెస్ట్ ఫలితాలు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆదివారం విడుదల చేసింది. ఈ ఫలితాలను ఎస్ఎస్‌సీ అధికారిక వెబ్‌‍సైట్‌లో ఉంచింది. మొత్తం 35,023 మంది అభ్యర్థులు టైపింగ్ టెస్టుకు, 4,374 మంది అభ్యర్థులకు కాగ్‌‍లో డీవీవో పోస్టులకు డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్‌కు ఎంపికయ్యారు. ఇక 1,511 మంది అభ్యర్థులు ఇతర విభాగాల్లో డీఈవో పోస్టులకు సంబంధించిన డేటా ఎంట్రీ స్కిల్ టెస్టుకు ఎంపికయ్యారు. టైర్ 2 పరీక్షలకు హాజరైన వారిలో 14,873 మంది అభ్యర్థులు టైపింగ్ టెస్టుకు, 220 మంది అభ్యర్థులు కాగ్‌లో డీఈవో పోస్టులకు, ఇతర విభాగాల్లో డీఈవో పోస్టులకు 1067 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 
 
కాగా, గత యేడాది మే నెల 24 నుంచి జూన్ పదో తేదీ వరకు స్టాఫ్ సెలక్షన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2021 టైర్ 1 పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 57,092మంది టైర్ 2 పరీక్షకు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబరు 18న టైర్ 2 పరీక్ష నిర్వహించారు. టైర్2 ఫలితాలను గతయేడాది డిసెంబరు 16వ తేదీన ఎస్ఎస్సీ విడుదల చేసింది. టైర్ 2 ఫలితాల్లో మొత్తం 40,908 మంది అభ్యర్థులు టైర్ 3లో స్కిల్ టెస్ట్, డేటా ఎంట్రీ టెస్ట్ పరీక్షకు ఎంపిక కాగా, వీటికి సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేశారు. 
 
టైర్ 3లో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాకు కేటాయిస్తారు. ఈ పరీక్షల ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సర్వీసుల్లో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టును భర్తీ చేస్తారు.