శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (15:12 IST)

పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి? ఎందుకో తెలుసా?

అక్రమ మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత గాలి జనార్ధన్ రెడ్డి పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆయన్ను పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గాలి జనార్ధన్‌రెడ్డి తాజా చిక్కులకు కారణం ఆయన అంబిడెంట్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడమే. అంబిడెంట్‌ను ఈడీ నుంచి కాపాడేందుకు ఆ కంపెనీతో గాలి డీల్ కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
దీనికి ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు అందుకున్నారు. ఈ కేసు నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి కోసం వేట కొనసాగుతోంది. ఈ ఒప్పందం గత మార్చిలో కుదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరు, బళ్లారి, ఢిల్లీలోని గాలి జనార్ధన్ రెడ్డి నివాసాలపై దాడులు చేసిన పోలీసులు అన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.