1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 25 జూన్ 2018 (19:02 IST)

గాలి జనార్ధన్ రెడ్డి, జగన్‌లకు లబ్ధి చేకూర్చడమే కేంద్రం లక్ష్యం...

అమరావతి : కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సీనియర్ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి, వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డిలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన

అమరావతి : కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సీనియర్ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి, వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డిలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్ని అనుకూలతలు ఉన్నాయని, గతంలోనే మెకాన్ సంస్థ నివేదిక ఇచ్చిందని స్వయానా బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడైన గాలి జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫీజిబులిటీ ఉందని బీజేపీ నాయకులే ఓపక్క చెబుతుంటే, కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. 
 
ప్రభుత్వ రంగ సంస్థలో రావాల్సిన ఉక్కు పరిశ్రమను ఏదో రకంగా రాకుండా చేసి, గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఉక్కు పరిశ్రమకు, ఆయనతో కలిసి ఉండే జగన్ మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలా చేయడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని విమర్శించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. భూమి, విద్యుత్, నీళ్లుతో పాటు దగ్గర్లోనే రైల్వే లైను ఉంది. ప్రభుత్వం రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రకాశం, కడప, అనంతపురంలో కావాల్సినంత నాణ్యమైన ముడిసరుకు ఉంది. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు, ముఖ్యంగా మోడీ ఉద్దేశపూర్వకంగానే ఏపికి అన్యాయం చేస్తున్నారని అన్నారు. 
 
ఇటీవల కాలంలో రాష్ట్రంలో చాలామంది చోటామోటా బీజేపీ నాయకులు రాయలసీమ డిక్లరేషన్ అంటున్నారు. రాయలసీమలో అన్ని అనుకూలతలు ఉన్న ఉక్కు పరిశ్రమనే తీసుకురాలేని వాళ్లు రాయలసీమ డిక్లరేషన్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడదని మంత్రి ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధనలో చాలా మంది బలిదానాలు చేశారు. ఇప్పుడు కడప ఉక్కు పరిశ్రమ సాధనకు ఎంపి సీఎం రమేశ్, శాసనమండలి సభ్యుడు బీటెక్ రవి ఆమరణదీక్షకు కుర్చున్నారన్నారు. వారి దీక్షకు మద్దతు ఇచ్చేందుకు పార్టీలకు ఆతీతంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా భారీ తరలివస్తున్నారని తెలిపారు. అయితే సీఎం రమేశ్, బీటెక్ రవిల ఆరోగ్య పరిస్థితి క్షిణిస్తున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
 
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని గాలి జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ఏపిలో ఉక్కు పరిశ్రమలను స్థాపించేందుకు చాలా పరిశ్రమలు క్యూలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. అయితే విభజన చట్టంలో భాగంగా తాము ప్రభుత్వ రంగ సంస్థే ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తడి తెస్తున్నామని స్పష్టం చేశారు.