ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 మార్చి 2017 (17:48 IST)

తండ్రిపై కక్ష.. కుమార్తెను కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతంలో 9 రోజులపాటు అత్యాచారం..

తండ్రిపై కక్ష సాధించుకోవడానికి కుమార్తెను వాడుకున్నారు కామాంధులు. తండ్రిపై అక్కసుతో 16 ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశారు. అంతేగాకుండా 9 రోజుల పాటు నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.

తండ్రిపై కక్ష సాధించుకోవడానికి కుమార్తెను వాడుకున్నారు కామాంధులు. తండ్రిపై అక్కసుతో 16 ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశారు. అంతేగాకుండా 9 రోజుల పాటు నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఒడిశాలో ఈ కిరాతకం జరిగింది.

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత పంచాయితీ ఎన్నికల్లో నిందితులు వ్యతిరేకించిన వారికి తన తండ్రి మద్దతివ్వడం వల్లే తనపై దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితురాలు వాపోయింది.

 వివరాల్లోకి వెళితే.. మార్చి 9వ, తేదిన అర్ధరాత్రి యువతి ఇంట్లో నిద్రిస్తుండగా ఓ వ్యక్తి తొలుత బాధితురాలని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడని.. కిడ్నాప్ చేసేందుకు అతనికి మరో నలుగురు సహకరించారని పోలీసులు చెప్పారు. 
 
అంతేగాకుండా బాధితురాలిని చేతులు, కాళ్ళు కట్టేసి ఓ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఆమెపై అమానుషంగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. దాదాపు 9 రోజుల పాటు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారని.. దీంతో బాధితురాలు ఆమె తండ్రి కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.