సంబంధిత వార్తలు
- తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ విద్యార్థులకు ముఖ్య గమనిక
- సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ షేర్ చేస్తే భారీ జరిమానా, ఎంతో తెలుసా?
- తెలుగు చిత్రపరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు... వివరాలు ఇవే..
- టొమాటో జ్వరం నుంచి పిల్లలను రక్షించాలంటే..?
- ఓటరు జాబితా సవరణలకు నూతన మార్గనిర్దేశకాలు: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
అంతర్జాతీయ విమాన ప్రయాణికులపై ఆంక్షలు సడలింపు
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు వ్యాక్సినేషన్ నిబంధనలతో పాటు హామీ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ తాజా నిర్ణయం ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకిరానుంది.
నిజానికి భారత్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఓ ఆన్‌లైన్ ఫాం ను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో తమ కోరానా వ్యాక్సినేషన్ వివరాలు, ఎన్ని డోసుల వ్యాక్సిన్ వేసుకున్న తదితర వివరాలను నింపాల్సి వుంది. ఇపుడు ఈ నిబంధనలను కేంద్రం సడలించింది.
ఇకపై అంతర్జాతీయ ప్రయాణికుల ఎయిర్ సువిధ పోర్టల్‌లో తమ వ్యాక్సినేషన్ వివరాలు అందజేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ అంక్షలు తొలగిస్తున్నామని, ఈ నిర్ణయం నేటి అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడం, ప్రపంచంతో పాటు భారత్‌లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరిగినందున్న వల్ల అంతర్జాతీయ ప్రయాణికులు మార్గదర్శకాలు సవరించి కొత్త మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
తర్వాతి కథనం
