గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (12:49 IST)

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ షేర్ చేస్తే భారీ జరిమానా, ఎంతో తెలుసా?

social media
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారికి కేంద్రం కళ్ళెం వేయనుంది. ఇలాంటి వారిని కట్టడిచేసేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ నిబంధనల మేరకు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే రూ.10 ల7ల మేరకు అపరాధం విధించనుంది. ఈ కొత్త మార్గదర్శకాలను పదేపదే ఉల్లంఘిస్తే మాత్రం ఈ అపరాధం రూ.50 లక్షలకు చేరనుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేవారిని రక్షించడమే లక్ష్యంగా ఈ కొత్త మార్గదర్శకాలను కేంద్రం ఖరారు చేసింది. వీటిని మరో 15 రోజుల్లో అమల్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
బ్రాండ్లను ఎండార్స్ చేసే సెలెబ్రిటీలు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో 15 రోజుల్లో ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపీ) పేరిట విడుదల చేయనుంది. 
 
తప్పుదోవ పట్టించే ప్రకటనల నుంచి ప్రజలను రక్షించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బ్రాండ్‌ను ఎండార్స్ చేసేవారు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు, బ్లాగర్లను దీనికిందకు తీసుకురానుంది. అంతేకాదు, వస్తువులను ఉచితంగా తీసుకుని వాటిని ప్రచారం చేసేవారు, పొందిన వస్తువులకు ముందుగా 10 శాతాన్ని టీడీఎస్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకున్న వస్తువులను మళ్లీ తిరిగి వారికి అప్పగిస్తే కనుక సెక్షన్ 194 కింద ఆ మొత్తాన్ని తిరిగి పొందొచ్చు.