గుడియా రేప్ కేసు దోషులకు 30న శిక్ష ఖరారు
ఢిల్లీలో ఐదేళ్ల బాలిక గుడియాను 2013 ఏప్రిల్ 15వ తేదీన కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు మనోజ్ షా, ప్రదీప్ కుమార్‌లను ఢిల్లీ కోర్టు శనివారం దోషులుగా ప్రకటించింది. 'బాధితురాలిపై వికారమైన, తిరుగుబాటు పద్ధతిలో అతి క్రూరంగా నేరానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన యావత్ సమాజ మనసుల్ని కదిలించివేసింది' అని కోర్టు విచారణ సందర్భంగా అభిప్రాయపడింది.
గుడియాను దోషులిద్దరూ 2013 ఏప్రిల్ 15న కిడ్నాప్ చేసి పలుమార్లు రేప్‌కు పాల్పడ్డారు. చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందనుకుని రూమ్ లోనే వదిలేసి పరారయ్యారు. చిన్నారిని హాస్పిటల్‌కు తరలించగా ఏడాది తర్వాత కోలుకుంది. ఫోక్సో చట్టం కింద ఐదేళ్లపాటు విచారణ జరిగిన ఈ కేసులో దోషులిద్దరికి ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు అనంతరం కోర్టు నుంచి బయటికి తీసుకువెళ్తుండగా దోషుల్లో ఒకరైన మనోజ్షా విలేఖరిపై దాడి చేశాడు.