శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (12:42 IST)

పైసలుంటేనే సహజీవనమన్న రంకు మొగుడు... దొంగగా మారిన వివాహిత... ఎక్కడ?

కోర్కెలు, జల్సాలు, షికార్లను అదుపు చేసుకోలేని ఓ వివాహిత రంకు మొగుడు (ప్రియుడు) మోజులో పడింది. ఇదే అదునుగా భావించిన 23 యేళ్ల యువకుడు... యుక్త వయసులో చేయకూడని తప్పుకు పాల్పడ్డాడు. తనపై మోజుపడిన ముగ్గురు

కోర్కెలు, జల్సాలు, షికార్లను అదుపు చేసుకోలేని ఓ వివాహిత రంకు మొగుడు (ప్రియుడు) మోజులో పడింది. ఇదే అదునుగా భావించిన 23 యేళ్ల యువకుడు... యుక్త వయసులో చేయకూడని తప్పుకు పాల్పడ్డాడు. తనపై మోజుపడిన ముగ్గురు బిడ్డల తల్లి అయిన 29 యేళ్ల వివాహితను తీసుకుని ఊరువదిలి పారిపోయాడు. హైదరాబాద్‌కు చేరుకున్న వీరిద్దరు తమ వద్ద ఉన్న డబ్బుతో కొంతకాలం అక్కడ ఎంజాయ్ చేశారు. తమ వెంట తెచ్చుకున్న డబ్బులు ఖర్చు అయిపోవడంతో ప్రియుడు అడ్డం తిరిగాడు. పైసలుంటేనే సహజీవనం చేస్తూ తృప్తి పరుస్తానంటూ మొండికేశాడు. దీంతో ఆ వివాహిత ప్రియుడిపై ఉన్న మోజుతో దొంగగా మారింది. చివరకు పోలీసులకు చిక్క జైలుఊచలు లెక్కిస్తోంది. ఈ కేసు హైదరాబాద్‌లో జరిగింది. 
 
నిజామాబాద్‌కు కె.పద్మ(29) కాలేజీ విద్య పూర్తిచేసింది. పదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. సరదాలు.. షికార్లకు అలవాటుపడిన ఆమె మనసు అదుపు తప్పింది. రత్నాల్లాంటి ముగ్గురు పిల్లల్ని వదిలేసి ఇంట్లో చెప్పకుండా అదే ప్రాంతానికి చెందిన కె.పవన్‌కుమార్‌ (23)తో లేచిపోయింది. వీరిద్దరూ హైదరాబాద్‌ చేరారు. పద్మను దిల్‌సుఖ్‌నగర్‌ గడ్డిఅన్నారంలో మానస ప్రగతి మహిళా వసతిగృహంలో చేర్పించాడు. 
 
ఇంట్లో నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు కావడంతో తినేందుకు.. హాస్టల్‌ అద్దె చెల్లించేందుకు డబ్బులేక... ప్రియుడి ఆదేశంతో దొంగగా మారింది. హాస్టల్‌లో తోటి విద్యార్థినుల సెల్‌ఫోన్లు, బంగారు గొలుసు చోరీ చేసింది. బాధితులు వార్డెన్‌ ద్వారా మలక్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నిఘా ఉంచిన పోలీసులు సెల్‌ఫోన్‌ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పద్మను పట్టుకుని జైలుకు పంపారు. పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు.