గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మణిపూర్ గవర్నర్‌గా తమిళ బీజేపీ సీనియర్ నేత ఇల.గణేశన్

భారతీయ జనతా పార్టీ తమిళనాడుకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ ఇల. గణేశన్‌‌కు గవర్నర్ గిరి దక్కింది. ఆయనను మణిపూర్‌ రాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ఈయన నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పచ్చజెండా ఊపారు. మణిపూర్ గవర్నరుగా ఉన్న నజ్మా హెప్తుల్లా పదవీ విరమణ చేయడంతో.. గణేశన్‌ను గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. 
 
కాగా, తమిళనాడుకు చెందిన ఈయన... రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించారు. తమిళనాడు రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. మణిపూర్ గవర్నరుగా ఉన్న డాక్టర్ నజ్మా హెప్తుల్లా ఆగస్టు 20వ తేదీతో పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో ఇల.గణేశన్‌ను కేంద్రం నియమించింది.