టోక్యో ఒలింపిక్స్ పోటీలు : షూటింగ్‌లో చతికిలపడిన మనుభాకర్ - యశస్విని
టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. షూటింగ్ విభాగంలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన మనుభాకర్, యశస్వినిలు ఉదయం చతికిలపడ్డారు.
అలాగే, మరోవైపు పురుషుల 10 మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో దీపక్ కుమార్, దివ్యాన్ష్‌సింగ్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. కాగా 624.7 పాయింట్లతో దీపక్ సింగ్ 26వ స్థానంలో ఉండగా.. 622.8 పాయింట్లతో దివ్యాన్ష్ సింగ్ 32వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా, అంకితా రైనా జోడీ ఓటమి పాలైంది. ఉక్రెయిన్ ప్లేయర్లు 6-0, 7-6, 10-8 తేడాతో గెలిచారు. గంట 33 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది. మొదటి 21 నిమిషాలు సానియా, అంకిత జంట ఆధిపత్యం ప్రదర్శించినా, తర్వాత ఉక్రెయిన్ జోడీ రేసులోకి వచ్చింది.