గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 జులై 2021 (10:45 IST)

టోక్యో ఒలింపిక్స్ : డబుల్స్‌లో సానియా జోడీకి షాక్

టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా ఆదివారం మరో ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో ఒలింపిక్స్ టెన్నిస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్‌ విభాగంలో సానియా మీర్జా, అంకితా రైనా జోడీ ఓటమి పాలైంది. 
 
ఉక్రెయిన్ ప్లేయర్లు 6-0, 7-6, 10-8 తేడాతో సానియా జోడీని ఓడిచారు. మొత్తం గంట 33 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది. మొదటి 21 నిమిషాలు సానియా, అంకిత జంట ఆధిపత్యం ప్రదర్శించినా, తర్వాత ఉక్రెయిన్ జోడీ రేసులోకి వచ్చింది.
 
మరోవైపు, పురుషుల సింగిల్స్‌ నుంచి బ్రిటన్‌ స్టార్‌ అటగాడు ఆండీ ముర్రే నుంచి తప్పుకున్నాడు. 34 ఏళ్ల ముర్రే తొడ కండరాలకు గాయం కావడంతో సింగిల్స్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ముర్రే ప్రకటించాడు. 
 
అయితే డబుల్స్‌లో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు. డిఫెండింగ్ చాంపియన్‌ అయిన ఆండీ ముర్రే 2012లో జరిగిన లండన్‌ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాడు. మళ్లీ నాలుగేండ్ల తర్వాత జరిగిన రియో ఒలింపిక్స్‌లో తన పతకాన్ని నిలబెట్టుకున్నాడు