గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (08:14 IST)

వింబుల్డన్‌ డబుల్స్‌లో సానియా మీర్జా సంచలన విజయం

అమెరికా వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో భాగంగా, మహిళల డబుల్స్ విభాగంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ సంచలన విజయాన్ని సాధించింది. అమెరికన్ క్రీడాకారిణి బెథానీ మాటెక్ శాండ్స్‌తో కలిసి వింబుల్డన్‌లో ఆడుతున్న సానియా, తొలి రౌండ్ లో ఆరో సీడ్ గా బరిలోకి దిగిన యూఎస్ - చిలీ జోడి డెసిరె క్రాజక్ - అలెక్సా గురాచీతో పోటీ పడిన సానియా జంట 7-5, 6-3 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. 
 
మరో మ్యాచ్‌లో లారెన్ డెవిస్‌తో కలసి బరిలోకి దిగిన అంకిత రైనా తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. ఇక పురుషుల డబుల్స్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రోహన్ బొపన్న, దివిజ్ శరణ్ జోడీ ఓటమి పాలైంది. ఎడ్వర్డో రోజర్, హెన్రీ కాంటినెన్ జంటతో పోటీ పడిన బొపన్న జోడీ 6-7 (6), 4-6 తేడాతో ఓడిపోయింది.