సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (14:41 IST)

రైతులకు శుభవార్త చెప్పిన ఐఎండీ... స్మార్ట్ ఫోన్ అవసరం లేదు.. ఎస్ఎంఎస్ ద్వారా?

Farmers
రైతులకు శుభవార్త. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకోసం భారత వాతావరణ శాఖ రైతులకు మరింత సాయం చేసేందుకు రెడీ అవుతోంది. 
 
రైతులకు స్థానిక భాషల్లో ఎస్ఎమ్ఎస్ ద్వారా వాతావరణ సూచనను అందించే స్కీమ్‌పై ఐఎండీ రెడీ అవుతోంది. ఈ సేవ పూర్తిగా ఉచితంగా అందించనుంది. ఈ సేవ కోసం హెల్ప్ లైన్ నంబర్ జారీ చేయనున్నారు.
 
ప్రాంతీయ స్థాయిలో వాతావరణ సంబంధిత సమాచారం అందుబాటులో ఉండటం వల్ల రైతులు ఎరువులు, ఇతర ఇన్‌పుట్‌ల వినియోగం, నీటిపారుదల వంటి వ్యవసాయ కార్యకలాపాలపై తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. సాధారణ పౌరులు కూడా కామన్ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి తమ ప్రాంతంలో వాతావరణ సూచనను తెలుసుకోవచ్చు.
 
దేశంలోని ఏ ప్రాంతమైన రైతు తన గ్రామం లేదా బ్లాక్ కోసం రాబోయే ఐదు రోజులలో వర్షం, ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం వంటి వాతావరణ సమాచారాన్ని పొందవచ్చు. ఐఎండీ ప్రత్యేక బృందం ఈ అప్లికేషన్‌పై పని చేస్తుంది.
 
ప్రస్తుతం రైతులకు స్మార్ట్ ఫోన్లు లేకపోవడం కారణంగా వారు వాతావరణ సంబంధిత సమాచారాన్ని పొందలేరు. తాజా కొత్త పథకం కింద అందించే సమాచారం ఆ ప్రాంతానికి మరింత నిర్దిష్టంగా ఉంటుంది. తద్వారా ఇది రైతుకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.