ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (14:04 IST)

40 రోజుల పాపను 14వ అంతస్థు నుంచి పారేసిన తల్లి.. ఎక్కడ?

baby
ముంబైలో దారుణం చోటుచేసుకుంది. తన 40 రోజుల కుమార్తెను ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. 14వ అంతస్థులోని బాల్కనీ నుంచి చిన్నారిని కింద పడేసింది. చికిత్స నిమిత్తం బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. వికలాంగురాలైన చిన్నారి తల్లి మాటలు రావు. అందువల్ల ఈ సంఘటన వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు చెప్పారు. ములుండ్ వెస్ట్‌లోని జెవార్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సొసైటీలోని ఒక భవనంలో 14వ అంతస్తులో ఈ వికలాంగ మహిళ తన కుటుంబంతో కలిసి  నివసిస్తోంది. ఆమెకు 40 రోజుల క్రితమే ఆడపిల్ల పుట్టింది. 
 
అయితే పాపను ఎందుకు 14 అంతస్థు నుంచి కిందపడేసిందని పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలిక తల్లిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ మహిళను ఇంకా పోలీసులు అరెస్టు చేయలేదు.