1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (12:25 IST)

కారంలో కల్తీ.. ఇలా గుర్తించవచ్చు తెలుసా?

కారం పొడి మన భారతీయ కిచెన్‌లో ఉండాల్సిన ముఖ్యమైన స్పైస్‌. ఇది వంటకు రుచితోపాటు రంగును కూడా అందిస్తుంది. కారాన్ని రుచికి సరిపడా ఉపయోగిస్తారు. అయితే, దీన్ని కూడా ఎర్ర ఇటుక పొడి లేదా ఇసుకతో కల్తీ చేస్తున్నట్లు సమాచారం. ఇది ఆందోళన చెందాల్సిన విషయమే.. ఆరోగ్యానికి హానికరం కూడా. అందుకే కారం పొడి కల్తీని గుర్తించడానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొన్ని పరీక్షలను ఇంట్లోనే నిర్వహించే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అది ఎలాగో తెలుసుకుందాం.
 
ఈ కారం పొడి కల్తీని మూడు విధాలుగా పరీక్షించవచ్చు.
మొదట ఒక గ్లాసు నీటిని తీసుకోవాలి. ఇందులో ఒక టేబుల్‌ స్పూన్‌ చిల్లీ పౌడర్‌ను కలపాలి. అప్పుడు దాన్ని పరీక్షించాలి. కొద్దిపాటి మిశ్రమాన్ని చేతిలో తీసుకుని రబ్‌ చేయాలి. ఇసుక రేణువులు ఉంటే తెలిసిపోతుంది. అప్పుడు మీరు వాడే కారం కల్తీ జరిగిందని గుర్తించవచ్చు. ఒకవేళ సబ్బు మాదిరి జిగురుగా ఉంటే.. ఇందులో సోప్‌స్టోన్‌ soap stone వాడినట్లు గుర్తించాలి.