ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:59 IST)

మరోసారి బండ పడింది... గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, ఎంతంటే?

గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మరోసారి ఎల్‌పీజీ ధరలను పెంచడంతో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర పెరగనుంది. ఈ సిలిండర్ ధర రూ.45 మేర పెరగనుండగా 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులేదు. ఇది కాస్త ఊరట కలిగించే అంశం.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో అమాంతం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాగా 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.854 వద్ద సాగుతోంది. మొత్తమ్మీద గ్యాస్ బండ రూ.1000కి చేరుకునే అవకాశం వుందంటున్నారు.