శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జులై 2020 (09:05 IST)

అయోధ్యపై ఐసిస్ గురి - ఆగస్టు 5న భారీ విధ్వంసానికి కుట్ర

ఆగస్టు ఐదో తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం భూమిపూజ జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనుంది. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. అతికొద్దిమంది వీవీపీఐపీలు పాల్గొంటున్నారు. అయితే, అయోధ్య రామ జన్మభూమి భూమి పూజా కార్యక్రమంతో పాటు ఆగస్టు 15వ తేదీన భారీ విధ్వంసానికి ఐఎస్ఐ ప్లాన్ చేస్తోందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. 
 
ఈ దాడుల కోసం లష్కర్, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్‌లో ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని సమాచారం. ఈ ఐఎస్ఐ ద్వారా శిక్షణ పొందిన ఉగ్రవాదులను మూడు లేదా ఐదు బృందాలుగా భారత్‌లోకి శత్రుదేశం పాకిస్థాన్ పంపించబోతోందని చెప్పింది. ఈ బృందాలు ఒక ప్రత్యేకమైన రీతిలో దాడులు చేసేలా పాకిస్థాన్ ప్లాన్ చేస్తోందని... భారత్‌లో అంతర్గతంగా దాడులు జరిగాయనే విధంగా ఆ దాడులు ఉండేలా స్కెచ్ వేసిందని తెలిపింది. ఈ దాడుల్లో ముఖ్యంగా వీవీఐపీలను టార్గెట్ చేస్తున్నారని హెచ్చరించింది. 
 
గత యేడాది ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్‌ 370 కింద జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్యలో జరగనున్న భూమిపూజ కార్యక్రమంలో ఉగ్రదాడులు జరిపేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ - ఐఎస్ఐ పథకం రూపొందించిందని నిఘా వర్గాలు తెలిపాయి.