గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: మంగళవారం, 22 నవంబరు 2022 (14:50 IST)

యువకుడిపై యువతులు సామూహిక అత్యాచారం.. అడ్రెస్ అడిగి కారెక్కించుకుని..?

harrasment
ఆడా మగా తేడా లేకుండా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. పంజాబ్‌లో యువకుడిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. తాజాగా రోడ్డు మీద వెళ్లే యువకుడిని అపహరించి నలుగురు యువతులు అత్యాచారం చేసిన ఘటన షాక్‌కు గురిచేస్తుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో నలుగురు అమ్మాయిలు ఓ యువకుడిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జలంధర్ కపూర్తలా ప్రాంతంలో లెదర్ కాంప్లెక్స్ రోడ్డులో చోటుచేసుకుంది.
 
లెదర్ కాంప్లెక్స్ రోడ్డులోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యువకుడు పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో   అతని పక్కగా రోడ్డుపై ఓ కారు ఆగిందని, కారులో ప్రయాణం చేస్తున్న నలుగురు అమ్మాయిలు అతనిని ఓ అడ్రెస్ అడిగారని తెలిపాడు. 
 
అతనిని కారులో ఎక్కించుకుని.. ఆపై ఒకరి తర్వాత ఒకరు తనపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.