అందమైన అమ్మాయిలు కాశ్మీర్ యువతను అలా వాడుకుంటున్నారట..
కాశ్మీర్ యువతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలు అందమైన అమ్మాయిలను ఎరగా ఉపయోగించుకుంటున్నాయని తెలిపింది. సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో నకిలీ పేర్లతో ఖాతాలను క్రియేట్ చేసుకుని.. యువతతో పరిచయం పెంచుకుని.. వలలోకి లాక్కుంటున్నారు.
ఇలా అందమైన అమ్మాయిల వలలో పడిన యువకులను టార్గెట్ చేసుకుని ఆయుధాలను రవాణా చేయడం, ఉగ్రవాదులకు దారి చూపడం వంటి పనులు చేయిస్తున్నట్లు పోలీసులకు షాకింగ్ నిజాలు తెలియవచ్చాయి. బందిపొరాకు చెందిన సయ్యద్ షాజియా అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ నిజాలు బయటికి వచ్చాయి.
తనతో పాటు చాలామంది అందమైన అమ్మాయలు ఉగ్రవాదుల కోసం పనిచేస్తున్నట్లు షాజియా తెలిపింది. ఈమె నుంచి భారీ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా షాజియా సోదరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.