శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 10 మే 2018 (13:11 IST)

రాళ్ళు రువ్వి మనుషుల ప్రాణాలు తీస్తే స్వాతంత్ర్యం రాదు : బిపిన్ రావత్

అల్లర్లకు పాల్పడే కాశ్మీర్ యువతకు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఓ సూచన చేశారు. తీవ్రవాదుల ప్రలోభాలకు లొంగి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అలాగే, రాళ్లు రువ్వి మనుషులు ప్రాణాలు తీస్తే స్వా

అల్లర్లకు పాల్పడే కాశ్మీర్ యువతకు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఓ సూచన చేశారు. తీవ్రవాదుల ప్రలోభాలకు లొంగి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అలాగే, రాళ్లు రువ్వి మనుషులు ప్రాణాలు తీస్తే స్వాతంత్ర్యం రాదని ఆయన అల్లరి మూకలకు హెచ్చరికలు చేశారు.
 
ఉగ్ర గ్రూపులు కొత్తగా ఉగ్రవాదులను చేర్చుకునే పనిలో ఉన్నాయని, యువత ఆ మార్గాన్ని ఎంచుకోరాదని కోరారు. ఎంతమంది ఉగ్రవాదులను చంపామన్న లెక్కలను తామెన్నడూ పరిగణనలోకి తీసుకోలేదని, భవిష్యత్తులోనూ ఇదే జరుగుతుందని చెప్పారు. ఇదే సమయంలో ఎవరినీ చంపాలన్న ఉద్దేశం తమకు ఉండదని, ఆయుధాలతో ఎవరు కనిపించినా, ముందుగా లొంగిపోవాలనే హెచ్చరిస్తామని తెలిపారు. 
 
పొరుగు దేశమైన పాకిస్థాన్, సిరియా వంటి దేశాల్లో ఉండే పరిస్థితులు దారుణంగా ఉన్నాయనీ, దీంతో అక్కడి ప్రభుత్వాలు, సైన్యం ట్యాంకులు, యుద్ధ విమానాలను వాడుతోందని ఆయన గుర్తు చేశారు. కానీ, కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత దిశగా ఇంతవరకూ ఒక్కసారి కూడా యుద్ధ విమానాన్ని వాడలేదని ఆయన తెలిపారు. ఇక్కడి యువతలో కోపముందన్న సంగతి తనకు తెలుసునని, హింసా మార్గంలో వెళితే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందన్న సంగతిని మరువరాదని హితవు పలికారు.