శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2022 (08:59 IST)

జమ్మూకాశ్మీర్‌లో దారుణం - జైళ్ళశాఖ డీజీపీ దారుణ హత్య

hemanth kumar lohia
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఏకంగా జైళ్ళ శాఖ డీజీపీ దారుణ హత్య హత్యకు గురయ్యారు. ఆ తర్వాత శవాన్ని ఇంట్లోనే హంతకులు తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ హత్యకు పాల్పడింది ఆయన ఇంట్లో పని చేసే సహాయకుడిగా భావిస్తున్నారు. అయితే, ఈయన ఇపుడు కనిపించకుండా పోయాడు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
హత్యకు గురైన డీజీపీ పేరు హేమంత్ కుమార్ లోహియా. జమ్మూకాశ్మీర్ జైళ్ళ శాఖ డీజీపీ. ఈయన తన ఇంట్లోనే అనుమానాస్పదంగా హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. అదేసమయంలో ఇంట్లో పని చేసే సహాయకుడు కనిపించకుండా పోవడంతో అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గాలిస్తున్నారు. 
 
57 యేళ్ల లోహియా 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆయన సోమవారం ఉడాయివాలాలోని తన నివాసంలోనే హత్యకు గురయ్యాడు. దుండగులు ఆయన గొంతు కోసం హత్య చేశాడు. అలాగే, ఆయన శరీరంపై కాలిన గాయాలు కూడా ఉన్నాయి. ఈ యేడాది ఆగస్టులో ఆయన జైళ్ల శాఖ డీజీపీగా నియమితులయ్యారు. 
 
దుండకులు తొలుత లోహియాను ఊపిరాడకుండా చేసి హత్య చేశారనీ, ఆ తర్వాత కిచెన్‌లోని గాజు సీసాతో గొంతు కోసినట్టుగా ఉందని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపాడు. దండుగుడు లోహియా గొంతు కోసిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఇంట్లోనే తగలబెట్టే ప్రయత్నం చేశాడని, పరారీలో ఉన్న ఆయన సహాయకుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.