suvichar
✕

జేఈఈ అడ్వాన్స్ 2026 విద్యార్థుల వ్యక్తిగత డేటా లీక్

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 5 జూన్ 2026 (17:23 IST)
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పరీక్షల్లో జేఈఈ అడ్వాన్స్ ఒకటి. అయితే, ఈ యేడాది జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షకు హాజరైన విద్యార్థుల వ్యక్తిగత డేటా మొత్తం లీకైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఐఐటీ రూర్కెలా ఖండించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరైన విద్యార్థుల వ్యక్తిగత డేటా లీకైనట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. 
 
జేఈఈ (అడ్వాన్స్‌డ్‌)-2026 ఫలితాలకు సంబంధించిన క్లౌడ్‌ స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్‌లో లోపం ఉన్న విషయం వాస్తవమేనని పేర్కొంది. అయితే, క్లౌడ్‌ స్టోరేజ్‌లో ఉన్న విద్యార్థుల డేటా కేవలం చదవడానికి మాత్రమే వీలుందని, మార్పు చేర్పులు చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది.
 
విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఐఐటీ రూర్కీ పేర్కొంది. క్లౌడ్‌ స్టోరేజ్‌ నుంచి ఏ విద్యార్థికి సంబంధించిన సమాచారాన్ని ఎవరూ సంగ్రహించలేరని.. అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు, పరీక్ష ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడలేదని వెల్లడించింది. 
 
అయినప్పటికీ, సమాచార గోప్యతను పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపింది. లక్షలాది విద్యార్థుల వ్యక్తిగత వివరాలతోపాటు, వారి పరీక్ష ఫలితాలకు సంబంధించిన సమాచారానికి గోప్యత, రక్షణ కరవైందంటూ ఓ యువ సైబర్‌ భద్రతా పరిశోధకుడు ఎత్తి చూపిన నేపథ్యంలో ఐఐటీ రూర్కీ ఈ మేరకు ప్రకటన వెలువరించింది. ఇదీ చదవండి: సీబీఎస్‌ఈ పోర్టల్‌పై క్లాడ్‌ టూల్స్‌ దాడి
About Author
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Allu Arjun: రెండు లక్షల మందితో పాట్నాలో పుష్ప 2’ కార్యక్రమానికి రెండేళ్లు

Rashmika: మైసా నుంచి విలువైన బంధాన్ని సెలబ్రేట్ చేసే మెలోడీ ఏనాటి వరమో నువ్వు రిలీజ్

Schola : డ్రగ్ మాఫియా నేపథ్యంతో స్కాలర్ సినిమా ఫస్ట్ లుక్

Suman: కాంతారావుగారి మాట ప్రకారం ఆ తప్పు చేయలేదు - హీరో సుమన్

Madura Audio: నీకై పరుగిడి పార్థు, వెంకటలక్ష్మిల ప్రణయగీతం

తర్వాతి కథనం
Show comments