కేటీఆర్‌కు కర్నాటక సీఎం కౌంటర్ - అంగుళం కొలవడం నేర్చుకోండి..
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కౌంటరిచ్చారు. ఆకాశాన్ని కొలిచే ముందు అంగుళం కొలవడం నేర్చుకోవాలంటూ హితవు పలికారు. పైగా మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ చాలా హాస్యాస్పందంగా ఉందన్నారు.
ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది బెంగుళూరుకు తరలివచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్నారంటూ చెప్పారు. స్టార్టప్‌లు, యూనికార్న్ సంస్థలు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న నగరం బెంగుళూరు అని సీఎం బసవరాజ్ అన్నారు.
అదేసమయంలో తెలంగాణాలో ఏం జరుగుతుందో ప్రపంచానికి బాగా తెలుసన్నారు. ఆకాశాన్ని కొలిచే ముందు అంగుళాన్ని కొలవడం నేర్చుకోవాలంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. మన పెళ్లెంలో ఈ పడినా పట్టించుకోని వారు పక్కవారి పళ్లెంలో పడిన ఈగ గురించి మాట్లాడటం సహజసిద్ధణని చెప్పారు.