ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2016 (14:50 IST)

సామాన్యులకు చేరని కొత్త నోట్లు... ఉగ్రవాదుల చేతుల్లో రూ.2 వేల నోట్ల కట్టలు

పాత కరెన్సీ నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొనివున్నాయి. కరెన్సీ కష్టాలతోపాటు చిల్లర కష్టాలు కూడా వర్ణనాతీతంగా మారాయి. ముఖ్యంగా దేశ కొంతమంది ప్రజల చేతిలోకిరాని రూ.2 వేల కొత్త నోటు.

పాత కరెన్సీ నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొనివున్నాయి. కరెన్సీ కష్టాలతోపాటు చిల్లర కష్టాలు కూడా వర్ణనాతీతంగా మారాయి. ముఖ్యంగా దేశ కొంతమంది ప్రజల చేతిలోకిరాని రూ.2 వేల కొత్త నోటు... ఉగ్రవాదుల ప్యాకెట్లలో చేరిపోయింది. ఇది ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి లోనుచేస్తోంది. 
 
నిజానికి దేశంలో పెరిగిపోతున్న నల్లధనాన్ని అరికట్టడంతో పాటు.. ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ పాత పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త రూ.2 వేలు, రూ.500 నోట్లను ప్రవేశపెట్టింది. అయితే, ఈ నోట్లు ఇంకా అనేక మంది సామాన్య ప్రజలకు అందలేదు. కానీ, ఈ కొత్త కరెన్సీ నోట్లు ఉగ్రవాదుల చేతుల్లో తళతళ మెరుస్తూ కనిపిస్తున్నాయి. 
 
12 రోజుల నుంచి చలామణి అవుతున్న రూ.2 వేల నోట్లను ఉగ్రవాదులు వాడటం మొదలుపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం జమ్మూ- కాశ్మీరులోని బందిపొర జిల్లాలో గోరీఖాన్-హజన్ ఏరియాలో ఉగ్రవాదులు దాగున్నట్లు సమాచాచారం రావడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది కూడా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్దనుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.