మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (22:25 IST)

త్వరలోనే జాతీయ పార్టీ.. అందులో నాది కీలక పాత్ర: కేసీఆర్

జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రకటించారు. దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు రావాల్సి ఉంది. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కేసీఆర్ ఫైర్ అయ్యారు. త్వరలోనే జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉంది. అందులో తాను ముఖ్య పాత్ర పోషించబోతున్నానని కేసీఆర్ వెల్లడించారు. 
 
కానీ ఓ కొత్త రూపంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని కేసీఆర్ ప్రకటించారు. అది మరో జాతీయ పార్టీ రూపంలో కూడా రావచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు జాతీ య పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు.
 
కచ్చితంగా బిజెపి ప్రభుత్వం వచ్చే ఎన్ని కల్లో ఓడిపోవాలని లేకపోతే భారత్‌కు ప్రమాదం అని ఆయన వెల్లడించారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని… అలాంటి ప్రచారాలకు తాను భయపడనని స్పష్టం చేశారు.