ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 మే 2022 (14:57 IST)

షవర్మా తిని ఒకరు మృతి.. 18 మందికి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స

shawarma
shawarma
కేరళలోని ఓ షాపులో షవర్మా తిని ఒకరు మృతి చెందగా.. మరో 18 మంది ఆస్పత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కాసరగోడ్‌ జిల్లాలో ఓ ట్యూషన్ కేంద్రానికి దగ్గర్లో ఉన్న జ్యూస్ షాప్‌లో షవర్మా కూడా అమ్ముతారు. అక్కడ ట్యూషన్‌కి వచ్చే పిల్లలు, విద్యార్థులు ఇక్కడ షవర్మా తిన్నారు. 
 
ఆహారం కలుషితం కావడంతో షవర్మా తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గుయారయ్యారు. ఇందులో ఓ 16 ఏళ్ళ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మరో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. 
 
ఆ జ్యూస్‌ షాప్‌లో షవర్మా తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. దీంతో జ్యూస్‌ షాప్‌పై కేసు నమోదు చేసి సీజ్‌ చేశారు. ఇక ఆసుపత్రిలో చేరిన మిగిలిన విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.