శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (11:29 IST)

కేరళను ముంచెత్తిన వరదలు.. నీటమునిగిన రాష్ట్రంలో సగభాగం

కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ఏర్పడ్డాయి. అరేబియాలో ఏర్పడిన అల్పపీడనంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో సగం భాగం ప్రస్తుతం జలమయమైంది. జూన్‌లో మొదలైన రుతుపవనాలు ఇంకా కొ

కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ఏర్పడ్డాయి. అరేబియాలో ఏర్పడిన అల్పపీడనంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఆ రాష్ట్రంలో సగం భాగం ప్రస్తుతం జలమయమైంది. జూన్‌లో మొదలైన రుతుపవనాలు ఇంకా కొనసాగుతున్నట్లు కొచ్చిన్ వర్సిటీ డైరక్టర్ మోహన్ కుమార్ తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కేరళలో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటికే 29మంది మృతి చెందారు. భారీ సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. 
 
రుతుపవనాల సమయంలో ఏర్పడిన అల్పపీడనం.. సాధారణంగా 10 రోజుల వరకు ప్రభావం చూపిస్తుంది. అయితే అల్పపీడనం తీవ్రతను బట్టే వర్షం కొనసాగుతుందని డైరక్టర్ చెప్పారు. రుతుపవనాల సమయంలోనే ఈ సారి 30 శాతం ఎక్కువ వర్షం కురిసింది. దానికి తోడు అల్పపీడనం కూడా కదలిక లేకుండా ఉందన్నారు.
 
సాధారణంగా దక్షిణంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తరం దిశగా పయనిస్తుంది. కానీ ఈసారి దక్షిణంలోనే కేంద్రీకృతం కావడం వల్ల కేరళను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కేరళలో మరో వారం రోజుల పాటు వర్షాలు, బలమైన గాలులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో…. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో మోస్తరు వాన పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది.
 
కరీంనగర్ జిల్లాలోనూ భారీ వర్షం పడుతోంది. వేములవాడలో వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో  ముసురు పట్టింది. మరోవైపు ఈనెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో  రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.