మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జులై 2020 (12:07 IST)

కేరళలో ఫస్ట్ బెల్ పేరుతో ఆన్‌లైన్ తరగతులు

కేరళలో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం అయ్యాయి. సోమవారం నుంచి కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ బెల్ పేరుతో వర్చువల్ తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్) విక్టర్స్ చానల్ ద్వారా ఈ తరగతులు ప్రారంభం కానున్నాయి. 
 
ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు సోమవారం నుంచి శుక్రవారం క్లాసులు జరుగుతాయని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (డీపీఐ) కె. జీవన్ బాబు తెలిపారు. క్లాస్ 11 మినహా 1 నుంచి 12వ తరగతి వరకు క్లాసులు నిర్వహించనున్నట్టు తెలిపారు. 
 
కైట్ విక్టర్స్ చానల్ ద్వారా తరగతులు ఉంటాయి "అని జీవన్ బాబు మీడియాకు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. పాఠశాలలను ఇప్పట్లో తెరిచే ఆలోచన లేదని.. అందుకే ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లు జీవన్ బాబు వెల్లడించారు. అయితే, వేర్వేరు తరగతులకు వేర్వేరు సమయాలు ఉంటాయని, టైమ్ స్లాట్లు అరగంట నుంచి రెండు గంటల వరకు మారుతుంటాయని కైట్ పేర్కొంది.