శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (11:07 IST)

లక్షద్వీప్ ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు జైలుశిక్ష

jail
లక్షద్వీప్ లోక్‌సభ స్థానం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్‌ ఓ హత్యాయత్న కేసులో దోషిగా తేలారు. దీంతో ఆయనకు కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. ఇదే కేసులో మరో నలుగురిని కూడా దోషులుగా తేల్చింది. వీరందరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గత 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్‌ను హత్య చేయడానికి మరో నలుగురితో కలిసి ఫైజల్ ప్రయత్నించారన్నది ప్రధాన అభియోగం. దీనిపై విచారణ జరిపిన కోర్టు నిందితులంతా హత్యాయత్నానికి ప్రయత్నించి విఫలైనట్టు కోర్టు తేల్చింది. దీంతో వీరందరినీ దోషులుగా ప్రకటించింది. 
 
మరోవైపు, కోర్టు తీర్పు నేపథ్యంలో వీరిని కేరళ రాష్ట్రంలోని కున్నూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, హత్యాయత్న కేసులో మహ్మద్ దోషిగా తేలడంతో ఆయనపై లోక్‍సభలో అనర్హత వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు.